పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్‌కు షాక్‌! | Sakshi
Sakshi News home page

పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్‌కు షాక్‌!

Published Fri, Mar 22 2024 11:23 AM

TDP Bharath Contested At Visakhapatnam Lok Sabha Seat - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా అసలు బీజేపీ నేతలకు బిగ్‌ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పురంధేశ్వరి ఆడుతున్న ‘ఫ్యామిలీ’ రాజకీయ క్రీడలో జీవీఎల్‌కు నిరాశే ఎదురైంది. 

కాగా, ఏపీ కూటమిలో సీట్ల కేటాయింపుల్లో భాగంగా చంద్రబాబు, పురంధేశ్వరి ప్లానే వర్క్‌ అవుట్‌ అవుతోంది. చంద్రబాబు సూచనలనే పురంధేశ్వరి కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాటను తూచా తప్పకుండా పురంధేశ్వరి అమలు చేస్తున్నారు. స్థానిక ఒరిజినల్‌ బీజేపీ నేతల మాటలను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, వారికి భంగపాటే ఎదురవుతోంది. తాజాగా మరోసారి పురంధేశ్వరి తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహరావును కాదని విశాఖ సీటును టీడీపీ ఇచ్చేందుకే అంగీకరించారు పురంధేశ్వరి. 

అయితే, ఈరోజు టీడీపీ పార్లమెంట్‌ స్థానాలకు గాను చంద్రబాబు 13 మంది అభ్యర్థుల బాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ అల్లుడు భరత్‌కు కేటాయించారు. ముందు నుంచీ విశాఖ సీటు తనకే వస్తుందనే నమ్మకంతో నిన్నటి వరకు జీవీఎల్‌ ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికల కోసం ప్లాన్‌ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో జీవీఎల్‌కు నిరాశే ఎదురైంది. ఇక, జీవీఎల్‌కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి వల్లే విశాఖ సీటు టీడీపీ వెళ్లిందని ఆరోపిస్తున్నారు. 

ఏలూరు స్ధానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత గారపాటి చౌదరికి నిరాశే ఎదురైంది. ఏలూరు ఎంపీ స్ధానాన్ని యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి ఇచ్చిన చంద్రబాబు. అలాగే, హిందూపూర్ స్ధానం కోసం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆశలు గల్లంతే అయ్యాయి. హిందూపూర్ పార్లమెంట్‌ స్ధానాన్ని పరిపూర్ణానందస్వామికి ఇవ్వాలని ఆర్ ఎస్ఎస్, వీహెచ్‌పీ విజ్ణప్తులని చంద్రబాబు పట్టించుకోలేదు. హిందూపూర్ స్ధానంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధిని ప్రకటించారు. 

టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే.. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement