కిలోల కొద్ది బంగారం కొంటున్నా.. కానీ రాజయోగం లేదు

Sircilla Party Leader Video Viral Before CESS Elections - Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్‌ సరాఫరా సంఘం(సెస్‌) ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఒకరిపై మరొకరు పైచేయి  సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండలం నుంచి సెస్‌ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఓ పార్టీ నాయకుడు రాజయోగం కోసం అదృష్ట ఉంగరం కొనేందుకు వెళ్లిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

15 ఏళ్ల క్రితం సదరు నాయకుడు బంగారం, అదృష్ట ఉంగరాల వ్యాపారి వద్ద అరతులం, తులం కొనేవాడని.. అదృష్ట ఉంగరం తీసుకున్న తర్వాత కిలోల కొద్దీ బంగారం కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. తాను అదృష్ట ఉంగరం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా బలంగా పడ్డానని, కానీ రాజయోగం మాత్రం రావడం లేదని అనడం కొసమెరపు. ఇదంతా సదరు వ్యాపారికి చెందిన యూట్యూబ్‌ ఛానల్‌లో 8 నెలల కిత్రం పోస్టు చేయగా.. సెస్‌ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైరల్‌ గామరింది.
చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top