హెల్త్‌ వర్సిటీకి వైఎస్సార్‌ పేరు సముచితం 

Seediri Appalaraju Fires On Chandrababu - Sakshi

ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసిన చరిత్ర చంద్రబాబుది 

మంత్రి సీదిరి అప్పలరాజు 

సాక్షి, అమరావతి: హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సముచితం అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వైఎస్సార్‌ పరిపాలనకు ముందు, ఆ తరువాత వైద్య రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, వైద్య విద్య, వైద్య శాఖలో సంస్కరణల్లో స్పష్టమైన తేడా ఉందని తెలిపారు. వైఎస్సార్‌ సువర్ణ పాలన, ఆయన ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టామన్నారు.

గురువారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో లక్షలాది మంది గుండెలు ఆగిపోకుండా ఉన్నాయంటే అందుకు కారణం వైఎస్సార్‌ తీసుకువచి్చన ఆరోగ్యశ్రీ పథకమే కారణమని మంత్రి చెప్పారు. వేలాది నిరుపేద విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుంటున్నారంటే దానికి వైఎస్సార్‌ చేసిన సేవే కారణమన్నారు. అన్ని బోధనాస్పత్రులు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ప్రజల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసి మానసికంగా హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. దాని నుంచి బయ టపడాలని విరుగుడుగా హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాడని, అందుకు చంద్రబాబు ఎంత బాధపడి ఉంటాడో ఆయ న మాటల్లోనే అర్థం అవుతుందని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top