‘ప్రతిరోజూ ఇలానే అనేక తప్పుడు ప్రచారాలు’

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu - Sakshi

తాడేపల్లి: ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు అండ్‌ కో అనవసరపు రచ్చ చేసి నానా హంగామా చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇలా రోజువారీ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సజ్జల తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ఇప్పటంలో లేనిదానిపై రచ్చ చేశారు..

చివరకు కోర్టు మొట్టికాయలు వేసింది. టీడీపీకి తెలిసిన ఏకైక విద్య తప్పుడు ప్రచారం. రోజువారీగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. ఏదో ఊహించుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నారు. ఇప్పటం విషయంపై అనవరసర రాద్దాంతం చేశారు. ప్రజలను ప్రతిపక్షాలు కావాలనే తప్పుదోవ పట్టించాయి. పవన్‌ సభకు భూములిచ్చిన వారి ఇళ్లు కూల్చడం అనేది పచ్చి అబద్ధం.నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించారు. హైకోర్టు సాక్షిగా నిజం బట్టబయలైంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top