టీడీపీ ఇప్పటికే కాడి పడేసింది: సజ్జల

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం ఇప్పటికే కాడి పడేసిందన్నారు.
చదవండి: టీడీపీ అక్రమాలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
చంద్రబాబు చెరలో దశాబ్దాలుగా కుప్పం మగ్గిపోయింది. సీఎం జగన్ వచ్చాకే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం జగన్ పాలనకు ప్రజలు పట్టంగడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదు. మా ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఓటర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికారు. రౌడీషీటర్లను టీడీపీ నేతలు.. పార్టీ ఏజెంట్లుగా పెట్టారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్న నమ్మకం ఉంది. మంచి చేసే నేతలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. వరుస ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న తీర్పే అందుకు నిదర్శనమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు