ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్‌ | Reservations: Chandrababu Is Unfair To Bcs | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్‌

Oct 10 2026 2:31 PM | Updated on Oct 10 2026 2:55 PM

Reservations: Chandrababu Is Unfair To Bcs

సాక్షి, విజయవాడ: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మేనిఫెస్టోలో హామీకి చంద్రబాబు మంగళం పాడేశారు. 34 శాతం రిజర్వేషన్ హామీకి చంద్రబాబు ఎగనామం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది.

బీసీ రిజర్వేషన్ల చట్టం చేయడంపై కనీసం చర్చించని చంద్రబాబు కేబినెట్.. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించలేదు. కేంద్రాన్ని 34 శాతం రిజర్వేషన్ కోరుతూ కనీసం తీర్మానం చేయని కేబినెట్.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కి ఆమోదం తెలిపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భారీ కోత పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రులు వెల్లడించారు.

ఆ జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. 26.73 శాతం పంచాయతీ వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. సర్పంచ్ లు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55, ఎంపీపీలు  24.60, జడ్పీటీసీలు 24.60, జడ్పీ ఛైర్మన్ లు 23.08 శాతం ఇస్తాం. అర్బన్ వార్డు మెంబర్లు 32.78శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02, మేయర్లు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు తీరని ద్రోహం జరిగింది. 2014-19 మధ్యలోనూ బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికలు పెట్టకుండా బీసీ నాయకత్వాన్ని తగ్గించేశారు. గతంలో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ  చదవండి: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement