మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు | Rahul Gandhi Not Afraid Modi Under His Investigative Agencies | Sakshi
Sakshi News home page

మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు

Feb 11 2022 10:00 AM | Updated on Feb 11 2022 10:00 AM

Rahul Gandhi Not Afraid Modi Under His Investigative Agencies  - Sakshi

మంగ్లౌర్‌: తాను ప్రధాని నరేంద్రమోదీకే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకూ తాను భయపడబోనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ‘ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాట నేను విననని ప్రధాని చెప్పారు. నిజమే... తన మాట నేను వినను. ఎందుకంటే ఆయనకే కాదు  ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు నేను భయపడను కాబట్టి’ అని తెలిపారు.  హరిద్వార్‌ జిల్లాలోనూ మంగ్లౌర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఒంటరిగానే మోదీతో పోరాటం చేయగలదని తెలిపారు. ఒక దొంగ స్థానంలోకి మరో దొంగను తీసుకొచ్చినట్టుగా రాష్ట్రంలో బీజేపీ ముఖ్య మంత్రులను మారుస్తోందని రాహుల్‌ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోదీ అధికారం నవ్వు తెప్పిస్తోందన్నారు. పేదలు, నిరుద్యోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు. 70 ఏళ్లలో దేశంలో అభివృద్ధే జరగలేదని మోదీ మాట్లాడుతున్నారని, ఇప్పటివరకు దేశం నిద్రపోయిందా? ఏదైనా మ్యాజిక్‌ జరిగి బీజేపీ అధికారంలోకి రాగానే మేల్కొని హఠాత్తుగా అన్నీ ఏర్పడ్డాయా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement