బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదే: ఆర్‌.కృష్ణయ్య | R Krishnaiah Applauds YSRCP Over Backward Classes Bill | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదే: ఆర్‌.కృష్ణయ్య

Jul 6 2021 12:44 PM | Updated on Jul 6 2021 12:48 PM

R Krishnaiah Applauds YSRCP Over Backward Classes Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ముషీరాబాద్‌: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో బీసీ బిల్లును పెట్టిన ఘనత ఒక్క వైస్సార్‌సీపీకే దక్కు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కొనియాడారు. భారత దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలవగా, వచ్చే పార్లమెంట్‌ సమావేశా ల్లో సైతం బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కాగా, ఆదర్శ పాఠశాల ల్లో పనిచేసే 1,000 మంది టీచర్లకు వెంటనే 7 నెలల జీతాలు చెల్లించడంతో పాటు వీరిని రెన్యువల్‌ చేయాలని ఆర్‌.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement