ఎన్నికల ఫలితాలు: పంజాబ్‌లో అఖండ ‘ఆప్‌ కీ సర్కార్‌’.. ఫలించిన ‘ఎక్‌ మౌకా’ నినాదం

Punjab Election Results 2022: AAP Lead To Form Government - Sakshi

పంజాబ్‌లో అద్భుతం జరిగింది. చీపురు పార్టీ ‘ఆమ్‌ఆద్మీ’ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 59 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఆప్‌. ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోకు, హామీలకు ప్రజలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా   ‘ఎక్ మౌకా కేజ్రీవాల్.. ఎక్ మౌకా భగవంత్ మన్’ను పంజాబ్‌ ప్రజలు విపరీతంగా ఆదరించారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా.. పంజాబ్‌ ఫలితాలు హేమాహేమీలకు షాక్‌ ఇచ్చాయి. అధికార కాంగ్రెస్‌, ప్రాంతీయ ఆదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్‌, మరో జాతీయ పార్టీ బీజేపీలకు కామన్‌గా షాక్‌ ఇచ్చింది ఆప్‌. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59. అయితే ఇప్పటికే ఆప్‌ ఆ ఫిగర్‌ను దాటేసింది. ఫోన్‌ కాల్‌ స్పందన ద్వారా ఎంపిక చేసిన సీఎం అభ్యర్థి భగవంత్‌ భగవంత్‌ మాన్‌ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాల్లో పంజాబ్‌ ఆప్‌ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top