కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా?

Patnam Mahender Reddy: Does BJP Has The Courage To Put KCR In Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏం చేశారని జైల్లో పెడతారు? బీజేపీకి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా’ అని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇతర రాష్ట్రాల కంటే సీఎం కేసీఆర్‌ తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్నందున అపుడు ఎవరు గెలుస్తారో చూద్దామని మహేందర్‌రెడ్డి సవాలు చేశారు. చదవండి: చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’

రామ మందిరానికి రూ.లక్ష విరాళం: పొన్నాల
‘నా పేరు లక్ష్మణుడు.. అందుకే రామభక్తితో నా వంతుగా రామ మందిర నిర్మాణానికి రూ.1,00,116 విరాళంగా ఇస్తున్నా..’అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రాముణ్ని రాజకీయాల్లోకి లాగకుంటే మంచిదని, గతంలో తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టానని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీఎం కేసీఆర్‌ మౌనం వీడాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top