Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM Revanth Reddy Strategic Attack On Chandrasekhara Rao
ఇరకాటంలో కేసీఆర్‌.. భ్రమలో తెలంగాణ సర్కార్‌?!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్‌ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది. వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

AP News: JC Prabhakar Reddy Warn Transport Officials Openly
‘నరికేస్తా..’ రవాణాశాఖ అధికారులకు జేసీ వార్నింగ్‌

అనంతపురం, సాక్షి: ఐదేళ్ల పాటు అధికార దాహంతో రగిలిపోయిన టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు తమ అసలు రూపం ప్రదర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి.. నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేసీ ఈ వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం. జేసీ ట్రావెల్స్‌ బస్సులు, లారీలను సీజ్‌ చేసిన వాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలో రవాణా శాఖ జేటీసీ శివరాం ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికా నాజ్ లకు నేరుగా బెదిరించారాయన.

Andhra Pradesh Latest News: Pawan Kalyan Take Deputy CM charges
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌

అమరావతి, సాక్షి: జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలోని క్యాంప్‌ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య.. అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి&గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారన్నది తెలిసిందే.బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు పలువురు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు క్యాంప్‌ కార్యాలయం వద్ద పవన్‌కి గౌరవ వందనం లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, దుర్గేష్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పవన్‌ ఇవాళంతా​ బిజి బిజీగా గడపనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం.. ఆపై పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్‌లోనే పవన్‌ బస చేయనున్నట్లు సమాచారం.

Srija Konidela EX Husband Sirish Bharadwaj Passed Away
శిరీష్ భరద్వాజ్ కన్నుమూత

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మృతి చెందారు. 2007లో శ్రీజను శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు.

Suryakumar Breaks Silence On Sluggish Batting Form With World Number 1 Claim
వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు

టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. సుమారు గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించి పలు సిరీస్‌లు గెలిచాడు కూడా!అయితే, టీ20 ప్రపంచకప్‌-2024లో మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు ఈ ముంబైకర్‌. అమెరికా వేదికగా జరిగిన లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లలో కలిపి సూర్యకుమార్‌ యాదవ్‌ కేవలం 59 పరుగులు చేశాడు.తొలుత ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రెండు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. పాకిస్తాన్‌పై ఏడు పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో సూర్య బ్యాటింగ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో అమెరికాతో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించిన స్కై.. 49 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి సూపర్‌-8కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ వేదికగా తదుపరి దశకు సిద్ధమవుతున్న వేళ సూర్యకుమార్‌ యాదవ్‌ మీడియాతో ముచ్చటించాడు.ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘రెండేళ్లుగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉండి.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌ చేయగలుగుతూ.. వికెట్‌కు అనుగుణంగా తనను తాను మలచుకోగల ఆటగాడు.. బ్యాట్స్‌మన్‌షిప్‌ చూపగలడు.నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు బౌలర్లు మన గేమ్‌ను రీడ్‌ చేస్తూ.. అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. పిచ్‌ కూడా వారికి అనుకూలిస్తే మనమేమీ చేయలేకపోవచ్చు.అలాంటపుడు మనం మరింత జాగ్రత్తగా.. తెలివిగా ఆడాలి. అయినప్పటికీ ఇన్నింగ్స్‌ పొడిగించుకునే అవకాశం దొరకకపోవచ్చు. పరిస్థితికి తగ్గట్లుగా మనం మారిపోవాలి.అంతేకాదు.. అపుడు మనతో పాటు క్రీజులో ఉన్న భాగస్వామితోనూ సరైన సమన్వయం ఉండాలి. పరస్పర అవగాహనతో పరుగులు రాబట్టడమే ధ్యేయంగా ముందుకు సాగాలి.నిజానికి న్యూయార్క్‌లో ఇదే తొలిసారి ఆడటం. అక్కడి పిచ్‌ కాస్త భిన్నంగా ఉంది. బ్యాటర్లకు సవాలుగా పరిణమించింది. అయితే, వెస్టిండీస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు.అక్కడ ఆడిన అనుభవం ఉంది. న్యూయార్క్‌ కంటే ఇక్కడ మెరుగ్గానే బ్యాటింగ్‌ చేస్తామనే నమ్మకం ఉంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.సూపర్‌-8 దశలో తప్పకుండా బ్యాట్‌ ఝులిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా గ్రూప్‌-1లో ఉన్న టీమిండియా జూన్‌ 20న అఫ్గనిస్తాన్‌తో సూపర్‌-8లో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

expert opinion on stock market investments in this market rally
మార్కెట్‌ ట్రెండ్‌ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆల్‌టైమ్‌హై చేరుకున్నాయి. రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు, వచ్చేనెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్నుదారులకు మరింత ఉపశమనం కల్పిస్తారనే వార్తలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఇలా పెరుగుతున్న షేర్ల విలువల మధ్య పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే సందేహం చాలామంది ఇన్వెస్టర్లకు వస్తోంది. మార్కెట్లు ఇంతలా పెరిగాక అనుకోకుండా నష్టాలకు వెళ్లిపోతే ఆందోళన సహజం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు మార్కెట్లు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దాంతో సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. అయితే ఇంతలా పెరిగిన ష్లేర్ల విలువ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవానుకుంటారు. కానీ మన లక్ష్యాలు ఏమిటో ఒకసారి తెలుసుకోవాలి. కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలుంటాయి. మరికొన్ని పదేళ్ల తర్వాత సాధించేవి ఉంటాయి. వివిధ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు తదితరాల ఆధారంగా మన ప్రణాళిక రూపొందించుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌ పనితీరును కచ్చితంగా అంచనా వేయలేమనే సంగతినీ మర్చిపోవద్దు. నిన్నటి పనితీరు నేడు, నేటి పనితీరు రేపు ఉంటుందన్న హామీ ఇక్కడేమీ ఉండదు. మార్కెట్‌ గమనం ఎటువైపు సాగుతుందన్న ఆలోచన ఎప్పుడూ సరికాదు. మంచి పెట్టుబడులను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగిస్తే మార్కెట్‌ ఎప్పుడూ మంచి ఫలితాలనే అందిస్తుందని గుర్తుంచుకోవాలి.ఎంపికే కీలకంగతకొన్ని రోజులుగా మార్కెట్‌లోని లాభాలను చూస్తున్న చాలామంది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనే మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ మొత్తం పెట్టుబడులను వీటికే కేటాయిస్తున్నారు. మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు వీటితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ఒక్కసారి దిద్దుబాటు వస్తే నష్టాలు అధికంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి, పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకునేటప్పుడు, లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవాలి.లక్ష్యాల ఆధారంగా..స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతోంది కదా అని ఉన్న పెట్టుబడి మొత్తం అంతా షేర్లలోనే మదుపు చేయడమూ సరికాదు. లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది. మంచి రాబడిని ఆర్జించేందుకూ వీలవుతుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో అందుబాటులో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు.సమీక్ష ముఖ్యం..సూచీల్లో వృద్ధి కారణంగా ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. వాటిని ఒకసారి సమీక్షించుకోవాలి. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్‌ క్యాప్‌లోకి మార్చుకోవచ్చు.మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్‌ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి.

Complainant U Turn in Bengal train accident Case
బెంగాల్‌ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ కాంచన్‌జంగా రైలు ప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఇప్పటిదాకా పది మంది మరణించగా.. 40 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు మాట మార్చారు. అసలు తాను ఫిర్యాదే చేయలేదని బాంబ్‌ పేల్చారు.బెంగాల్‌ రైలు ప్రమాదంపై జల్‌పాయ్‌గురి రైల్వే పోలీసులు(GRP) మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. లోకో పైలట్‌, కో-పైలట్‌ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతూ.. చైతలి మజుందార్‌ అనే ప్రయాణికురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘రైలు రంగపాణి-నిజ్బరి స్టేషన్ల మధ్య ఉండగా.. హఠాత్తుగా కుదుపులకు లోనైంది. మా బోగీలో ఉన్నవాళ్లమంతా అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈలోపు స్థానికులు తీవ్రంగా గాయపడిన మమ్మల్ని బయటకు తీశారు. బయటకు వచ్చి చూస్తే మా రైలును వెనుక నుంచి గూడ్స్‌ ఢీ కొట్టింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనూ కొందరు చనిపోయారు. పైలట్‌-లోకో పైలట్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నా’’ అని ఫిర్యాదులో ఉంది. అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్‌ మరణించగా.. లోకో పైలట్‌ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చైతలి ఫిర్యాదు ఆధారంగానే ఇండియన్‌ రైల్వేస్‌ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈలోపే ఆమె ట్విస్ట్‌ ఇచ్చారు. తాను అసలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చారు. జీఆర్పీ అధికారులు ఓ తెల్లకాగితంపై తనతో సంతకం చేయించుకున్నారని.. దానినే ఫిర్యాదులేఖగా మార్చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అయితే మజుందార్‌ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Vijay Sethupathi Comments On Telugu Movies
తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్‌ సేతుపతి

సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ఇంత వరకు తెలుగులో డైరెక్ట్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌.. తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెళ్లడించారు.విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్‌ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. 'నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ. ఆ ప్రాజెక్ట్‌లో వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక్కడి వారు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్‌ చేసిన పాత్రకు నేను సెట్‌ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. భవిష్యత్‌లో నాకు సెట్‌ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను.' అని విజయ్‌ సేతుపతి అన్నారు.నిథిలన్‌- విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మహారాజ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆధరిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్‌ వంటి వారు కీలక ఇందులో పాత్రలు పోషించారు. విజయ్‌ సేతుపతి కెరియర్‌లో 50వ చిత్రంగా జూన్‌ 14న మహారాజ విడుదలైంది. ఇప్పటికే సుమారు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Kane Williamson Quits New Zealand Captaincy Declines Central Contract After T20 WC
విలియమ్సన్‌ అనూహ్య ప్రకటన: కెప్టెన్సీకి గుడ్‌ బై.. ఇకపై..

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొన్నాడు. ఏడాది కాలానికి(2024-25)గానూ తాను బ్లాక్‌కాప్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది.గౌరవిస్తున్నాంవిలియమ్సన్‌ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొన్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులోనే ఉంటానని అతడు చెప్పినట్లు తెలిపింది. తమ అత్యుత్తమ బ్యాటర్‌కు ఈ వెసలుబాటు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో న్యూజిలాండ్‌ చేదు అనుభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో నాలుగింట రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన విలియమ్సన్‌ బృందం.. సూపర్‌-8కు కూడా చేరకుండానే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో కెప్టెన్‌ విలియమ్సన్‌ టీ20 కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఇప్పట్లో రిటైర్‌ కాబోనని మాత్రం చెప్పాడు. అయితే, అనూహ్యంగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.అందుకే ఈ నిర్ణయం విదేశీ లీగ్‌(టీ20)లలో అవకాశాలు అందిపుచ్చుకోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్‌ విలియమ్సన్‌ కివీస్‌ బోర్డుకు వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్‌కు సేవలు అందించే క్రమంలో.. తన కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఏడాది కాలం పాటు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.కాగా 2024-2025 ఏడాదికి గానూ కివీస్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు తక్కువే ఉన్నాయి. అయితే, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరాలంటే మాత్రం కీలక మ్యాచ్‌లలో గెలుపొందాల్సిన అవసరం ఉంది. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తాడుఈ నేపథ్యంలో కేన్‌ విలియమ్సన్‌ టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండేందుకు సమ్మతించడం గమనార్హం. ఈ ఏడాది నవంబరులో సొంతగడ్డపై కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇక కేన్‌ విలియమ్సన్‌ నిర్ణయం గురించి న్యూజిలాండ్‌ బోర్డు సీఈవో మాట్లాడుతూ.. దిగ్గజ ఆటగాడి అభ్యర్థన పట్ల తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ బ్యాటర్‌ త్వరలోనే తిరిగి సరికొత్త ఉత్సాహంతో జట్టుతో చేరతాడని పేర్కొన్నారు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్‌ హీరోలు!

AP Assembly 2024 June Session: No Clarity On Deputy Speaker Post
డిప్యూటీ స్పీకర్‌ విషయంలో ట్విస్ట్‌ తప్పదా?

అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్‌ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్‌ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్‌ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్‌ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్‌ టాక్‌. డిప్యూటీ స్పీకర్‌ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్‌ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement