
YSRCP MP Reddappa: కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయాడని చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఆయన ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని హితవు పలికారు. కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇకనైనా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలన్నారు.
ఎన్నికల్లో ఓటమి భయంతో బహిష్కరణ నాటకం మొదలు పెట్టారని మండిపడ్డారు.టీడీపీ నేతలకు సిగ్గు, శరం లేదని బహిష్కరణ చేసిన వాళ్లు బీఫాంతో నామినేషన్ ఎలా వేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే భారీ విజయం సాధించామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం సాధిస్తుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు.