‘పబ్జీ బ్యాన్.. యువత పరిస్థితి ఏంటీ..?’

Modi Govt Wanted To Ban PUBG But Realised Youth will then ask for jobs - Sakshi

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం చైనా యాప్స్‌ బ్యాన్‌పై మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలో చైనాకు చెందిన మరో 47 యాప్స్‌ను కూడా బ్యాన్‌ చేస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా త్వరలో ప్రముఖ గేమింగ్‌ యాప్‌ పబ్జీని కూడా బ్యాన్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. పబ్జీ బ్యాన్‌పై వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రతినిధి అభిషేక్‌ మను సింగ్వీ కేంద్రంపై వ్యంగ్యాస్తా‍లు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించిన ఆయన.. ‘ప్రముఖ ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌ అయిన పబ్జీని నిషేధించాలని కేంద్రలోని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ఒకవేళ యువత ఆడటం మానేస్తే.. వారు దేశంలోని నిరుద్యోగ వంటి వాస్తవాల గురించి ప్రశ్నిస్తారు. ఇది మరింత తీవ్ర సమస్య అవుతోందని కేంద్రం గ్రహించింది’. అని అభిషేక్‌ మను సింగ్వీ పేర్కొన్నారు. (పబ్జీ పోయినా ఈ గేమ్స్‌ ఉన్నాయిగా... )

మరోవైపు కరోనా కారణంగా ఏర్పడిన సంకక్షోభంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితి ఎంటనీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా గతంలో బ్యాన్‌ చేసిన  చైనాకు చెందిన 59 యాప్స్‌కు క్లోన్‌గా ఉన్నందున ఈ 47 మాప్స్‌ను బ్యాన్‌ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. వినియోగదారుల గోప్యత, జాతీయ భద్రత నియమాలను ఈ యాప్స్‌ ఉల్లంఘిస్తున్నయన్న నేపథ్యంలో వీటిని బ్యాన్‌ చేసినట్లు తెలుస్తోంది.  దీనికి తోడు ప్రభుత్వం మరో 250కు పైగా యాప్స్ పై నిఘా పెట్టిందని, అయితే ఈ జాబితాలో పబ్జీ కూడా ఉన్నట్లు సమాచారం అందగా దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. (ప‌బ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top