
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సీఎం తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. చాలామంది సీమాంధ్ర నాయకులు ఇంకా తెలంగాణను దోచుకుంటుంన్నారు.
నాకు మంత్రి పదవి హైకమాండ్ ప్రామిస్ చేసింది. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లుగా సీఎం రేవంత్ తీరు ఉంది’ అని ధ్వజమెత్తారు.
