సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం.. మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ | Sakshi
Sakshi News home page

సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం.. మంత్రి ఉత్తమ్‌ సవాల్‌

Published Sun, May 26 2024 4:35 PM

Minister Uttam Kumar Reddy Comments On BRS And BJP

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను వెయ్యి కోట్లు తీసుకున్నానని.. నీచపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

‘‘వినతి పత్రాలు తెచ్చి.. లోపలికి వెళ్లి భూములు సెటిల్‌మెంట్‌ మాట్లాడినట్టు కాదు. మేము అధికారంలోకి వచ్చే నాటికి సివిల్‌ సప్లైస్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, డీఫాల్డ్‌ చేసే మిలర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదు. డీఫాల్ట్‌ మిల్లర్లతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కై మాట్లాడుతున్నారు’’ అని ఉత్తమ్‌ దుయ్యబట్టారు.

సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం అంటూ కేటీఆర్‌, మహేశ్వర్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ విసిరారు. సివిల్‌ సప్లైస్‌ రూ.11 వేల కోట్ల నష్టాల్లోఉంది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను. ధాన్యం కొనుగోళ్లను గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాం. మేం రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి’’అని ఉత్తమ్‌ మండిపడ్డారు.

కేటీఆర్, మహేశ్వర రెడ్డి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా కనీసం వాళ్లని కలవలేదు.. నాలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు.. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు.. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుంది.. టెండర్‌లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుంది. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం మాదే.. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు.

డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోంది.. మిల్లర్ల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న వాళ్ళే మిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం మాది కాదు. మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం. మహేశ్వర రెడ్డి అవగాహన రాహిత్యంతో  మాట్లాడుతున్నాడు’’ అంటూ ఉత్తమ్‌ దుయ్యబట్టారు.

‘‘కిషన్‌రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారు. పార్టీలో ఓవర్ స్పీడ్‌గా పోవాలని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నాడు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో 1700 వచ్చింది. ఇప్పుడు 2400 వస్తోంది. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్‌ చెప్పారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement