కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు.. మంత్రి ఉత్తమ్‌ క్లారిటీ | Minister Uttam Kumar Reddy Clarified On KRMB Issue In Telangana, Details Inside - Sakshi
Sakshi News home page

Uttam Kumar Reddy On KRMB: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు.. మంత్రి ఉత్తమ్‌ క్లారిటీ

Published Fri, Feb 9 2024 6:38 PM

Minister Uttam Kumar Clarified On Krmb Issue In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి అప్పగించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయమై శుక్రవారం ఉత్తమ్‌ అసెంబ్లీలో మాట్లాడారు.  బీఆర్‌ఎస్‌ వాళ్లు ఎక్కడి నుంచో మినట్స్‌ తెచ్చి సమాధానం చెప్పాల్సిందిగా మమ్మల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు. 

‘కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.కృష్ణా నీటిని ఏపీకి తరలించే ఒప్పందం ప్రగతిభవన్‌లోనే జరిగిందా లేదా కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగింది’ అని ఉత్తమ్‌ మండిపడ్డారు. 

ఇదీ చదవండి.. గ్రూప్‌ 1 పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
 

Advertisement
 
Advertisement