Andhra Pradesh Minister RK Roja Fires On TDP In Guntur District - Sakshi
Sakshi News home page

Minister RK Roja: తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్‌ అవుతారు: ఆర్కే రోజా

Sep 7 2022 12:22 PM | Updated on Sep 7 2022 12:57 PM

Minister RK Roja Fires on TDP in Guntur District - Sakshi

మంత్రి ఆర్కే రోజా ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, గుంటూరు: అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గుంటూరువారితోటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మంత్రి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెలరోజులు రాజకీయం చేస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే పూల్స్‌ అవుతారని హెచ్చరించారు.

ఇ‍ప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మేము పెట్టాం.. మీరు తీసేశారని ఆరోపణలు చేసి టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: (కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జడ్పీటీసీ రాజ్‌కుమార్‌ అరెస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement