ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్‌ | Minister Peddireddy Ramachandra Reddy Firs On Chandrababu | Sakshi
Sakshi News home page

ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు

Feb 14 2021 12:09 PM | Updated on Feb 14 2021 12:35 PM

Minister Peddireddy Ramachandra Reddy Firs On Chandrababu - Sakshi

సాక్షి, చిత్తూరు: ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం స్పష్టమైందని.. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఘన విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని టీడీపీ నేతలు కోరడం సిగ్గు చేటని మంత్రి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని, చంద్రబాబు తానా అంటే కొన్ని ఛానల్స్‌, పత్రికలు తందానా అంటున్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలని మంత్రి పెద్దిరెడ్డి కొట్టి పారేశారు.

ఆయన.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ: మంత్రి వెల్లంపల్లి
విజయవాడ: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో మరో పార్టీ లేకుండా ప్రజలు తీర్పు చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండో దశలో కూడా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌ సీపీదే గెలుపు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడలోని 64 డివిజన్లు వైఎస్సార్‌ సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో లక్షమంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రూ.600 కోట్లతో విజయవాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ అని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. కేశినేని నాని ఎంపీగా ఉండి నిధులు తేలేని అసమర్థుడని.. మేయర్ పీఠం అంచులకు కూడా ఆయన రాలేడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు.
(చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ)
టీడీపీ కంచుకోటలు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement