చం‍ద్రబాబుకి వయసుకు తగ్గ సంస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి | Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu In Chittoor | Sakshi
Sakshi News home page

చం‍ద్రబాబుకి వయసుకు తగ్గ సంస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి

Nov 8 2021 1:11 PM | Updated on Nov 8 2021 2:25 PM

Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకి వయసుకు తగ్గ సంస్కారం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచం‍ద్రారెడ్డి విమర్శించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచం‍ద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకి తనపై తనకు నమ్మకంలేదని విమర్శించారు. బాబు.. తన తాబేదార్లతో మాట్లాడించుకోవడం తగ్గించుకోవాలని.. లేకుంటే అదే స్థాయిలో సమాధానం చెబుతామని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.

కుప్పం నియోజక వర్గంలో బాబు చేసిన అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత బాబు.. కుప్పం వచ్చే పరిస్థితి ఉండదని మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

చదవండి: కాంగ్రెస్‌ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement