సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం దసరా సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే సోమవారమే చంద్రబాబు సర్కారు రూ.1,000 కోట్ల బడ్జెట్ అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది.


