చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు: మంత్రి పెద్దిరెడ్డి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు: మంత్రి పెద్దిరెడ్డి

Published Fri, Feb 9 2024 4:21 PM

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నాడని.. ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఇప్పుడు మరోసారి హామీలతో వస్తున్నాడు. అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు అలిపిరి వద్ద కాన్వాయ్‌పై రాళ్లు వేయించింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు. సీఎం జగన్‌పై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇందుకే చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు’’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. అధికారం కోసం బాబు ఎన్ని కుట్రలైనా చేస్తాడంటూ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే..

Advertisement
 
Advertisement