నిమ్మగడ్డ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు..

Minister Peddireddy Comments On Sec Nimmagadda Ramesh - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తిరుపతి: అధికారులను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు రాగానే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవించామని తెలిపారు. 2002 నుంచి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ వస్తోందని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా 19ఏ చట్టం తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..

‘‘చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. సొంత జిల్లాలోనూ మెజారిటీ తెచ్చుకోలేని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఏ రోజైనా ప్రజల కోసం పనిచేశారా?. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్‌. పులివెందులలో ఆయన  ఒక్క రూపాయికే వైద్యం అందించారు. వైఎస్సార్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు.

గొడవలు వద్దు.. ఏకగ్రీవం చేసుకుందాం: నారాయణ స్వామి
వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న భయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లు రావనే ఎస్ఈసీ చెలరేగుతోందన్నారు. గ్రామాల్లో గొడవలు లేకుండా ఏకగ్రీవం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.అభివృద్ధిని కాంక్షించే వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడ్పాటును అందించాలని కోరారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. చదవండి: ఫ్యాక్షనిస్టులా నిమ్మగడ్డ శైలి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top