కేటీఆర్‌,హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌ | Minister Komatireddy Venkat Reddy Comments On KTR, Harish Rao | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌,హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

Oct 11 2024 1:18 PM | Updated on Oct 11 2024 4:34 PM

Minister Komatireddy Venkat Reddy Comments On KTR, Harish Rao

సాక్షి,నల్గొండజిల్లా:కేసీఅర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కేటీఆర్,హరీష్‌రావు అనే పిల్లలు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని గందంవారి గూడెంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు కోమటిరెడ్డి శుక్రవారం(అక్టోబర్‌11) శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ‘నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్‌ ఉద్యోగం ఇవ్వలేదు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడు.

రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తాం. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్‌ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’అని కోమటిరెడ్డి చెప్పారు. 

కేసీఆర్పై కారాలు మిర్యాలు నూరిన కోమటి రెడ్డి

ఇదీ చదవండి: ఆశపెట్టి నిరుద్యోగితో ఆడుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement