కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌ | Minister Komatireddy Venkareddy Fire On Ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

Oct 22 2024 2:41 PM | Updated on Oct 22 2024 3:15 PM

Minister Komatireddy Venkareddy Fire On Ktr

సాక్షి,హైదరాబాద్‌: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్‌ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్‌22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. 

‘పార్లమెంట్‌లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌ తరహాలో అసెంబ్లీ..

‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్  తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర  ఏర్పాటు చేస్తున్నాం​. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement