Kodali Nani: Minister Thanked CM YS Jagan for Naming New District as NTR - Sakshi
Sakshi News home page

వారి తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని

Jan 29 2022 11:35 AM | Updated on Jan 29 2022 12:54 PM

Minister Kodali Nani Thanked CM YS Jagan for Naming New District as NTR - Sakshi

సాక్షి, గుడివాడ: పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్‌ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.

అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.  

చదవండి: (రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement