‘టీడీపీ బంద్‌ అన్నారు.. హెరిటేజ్‌ కూడా మూసివేయలేదు’ | Minister Karumuri And MP Bharath Satirical Comments On TDP Bandh Call In AP - Sakshi
Sakshi News home page

‘టీడీపీ బంద్‌ అన్నారు.. హెరిటేజ్‌ కూడా మూసివేయలేదు’

Sep 12 2023 12:36 PM | Updated on Sep 12 2023 1:05 PM

Minister Karumuri And MP Bharath Satirical Comments On TDP Bandh - Sakshi

సాక్షి, తాడేపల్లి: స్కిల్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ, బంద్‌ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో​, టీడీపీ బంద్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ సెటైరికల్‌ పంచ్‌ వేశారు. కనీసం, చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. 

హెరిటేజ్‌ కూడా మూయలేదు..
కాగా, మంత్రి కారుమూరి మంగళవారం​ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ బంద్‌ గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారు. అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ కూడా మూయలేదు. ఎవరూ కనీస సానుభూతి కూడా చూపించలేదు. చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని నారా లోకేశ్‌ కూడా చెప్పలేడు. ఎన్టీఆర్‌ కుటుంబం కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎందకు చెప్పలేరు. అలాంటి అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. 

స్టేలు తెచ్చుకోవడమే బాబు, లోకేశ్‌కు తెలుసు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తున్నారు. సీఎం జగన్‌ హయాంలో ఏపీలో పేదరికం బాగా తగ్గింది. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగింది. చంద్రబాబు, నారా లోకేశ్‌ల అవినీతి మీద కేసులు వేస్తే వారు స్టేలు తెచ్చుకున్నారు. వీటిని విచారణకు సహకరించి.. వారు ప్రజల వద్దకు రావాలని సూచించారు. 

స్కిల్‌ స్కాం జరిగినట్టు ఎల్లో బ్యాచ్‌ ఒప్పుకుంటోంది!
మరోవైపు.. చంద్రబాబు స్కిల్‌ స్కాంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కూడా స్పందించారు. రాజమండ్రితో ఎంపీ భరత్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు ఎందుకు చెప్పడం లేదు. స్కిల్ కుంభకోణంలో లేమనే చెబుతున్నారు కానీ.. స్కాం జరిగిందని టీడీపీ నేతలు చెప్పుకోవడం లేదు. 

పోలవరం, అమరావతి స్కామ్‌లు..
ఏపీలో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు అత్యంత సెక్యూరిటీ ఉంది. చంద్రబాబుకు వీవీఐపీ కంటే అత్యంత సెక్యూరిటీ కల్పించామని జైలు సూపరింటెండెంట్‌ ఇప్పటికే నివేదిక ఇచ్చారు. చంద్రబాబుకు హౌస్‌ కస్టడీ దేనికి. ఇవన్నీ జైలు నుంచి బయటకు వచ్చేందుకే చేసే ప్రయత్నాలు మాత్రమే. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జీఎస్టీ ఇచ్చిన నోటీసు వల్ల బయటపడింది. స్కిల్‌ స్కామ్‌ మాత్రమే కాదు.. పోలవరం, అమరావతి భూముల స్కాములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చంద్రబాబుకు కావాల్సిన ప్రతీ సౌకర్యాన్ని కల్పించింది. 

పవన్‌ చీకటి ఒప్పందం..
చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌కు చీకటి ఒప్పందం ఉంది. అది ప్యాకేజీ ఒప్పందం. టీడీపీ నేతలు ఏపీలో బంద్‌ పేరు చెప్పి షాపులను మూసివేయాలని బ్రతిమాలుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ కరెక్ట్‌ కావడం వల్లనే ప్రజలు అంగీకరించారు. బంద్‌ను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement