
సాక్షి, అమరావతి/రాయదుర్గం: ఏదైనా ఘటన జరిగితే టీడీపీ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో, రాయదుర్గంలో బుధవారం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
► గతంలో చంద్రబాబు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు. ఆ మాటలకు ఇప్పటివరకు దళితులకు క్షమాపణ చెప్పలేదు. చంద్రబాబు దళిత ద్రోహి.
► దళితులు స్నానం చేయరు.. మురికిగా ఉంటారని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడితే చర్యలేవి?
► దళితులను ఉద్దేశించి ‘మీకెందుకురా రాజకీయాలు’ అని దూషించిన చింతమనేని ప్రభాకర్‌పైనా చర్యలు తీసుకోలేదు.