కాంగ్రెస్‌కు తాత్కాలిక ఓటమే.. లోక్‌సభకు సిద్ధమవుతాం: ఖర్గే

Mallikarjun Kharge Says We will Overcome Temporary Setbacks Over Losing In Three States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో తెలంగాణ మినహా.. మూడు రాష్ట్రాల్లో గెలుపును బీజేపీ సుస్థిరం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణలో.. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో అధికారం​ నిలబెట్టుకొని.. తెలంగాణలో గెలిచి.. మధ్యప్రదేశ్‌లో గట్టి పోటీ ఇస్తామనుకున్న కాంగ్రెస్‌ గట్టి షాక్‌ తగిలింది. తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైంది. 

మూడు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే స్పందించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటమిని తాత్కాలిక పరాజయంగా భావిస్తామని తెలిపారు. ఈ ఓటమిని నుంచి బయటపడి.. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలపే లక్ష్యంగా సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. 

కాగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో(రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌) అధికారం కోల్పోయింది. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. అయితే ముందు నుంచి  ఊహించినట్టు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసింది. మొత్తగా చూసుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ గెలుపు కొంత ఉపశమనం కలిగించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top