Tamilnadu: సీఎం స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరిన మహేంద్రన్‌

Mahendran Former MNM Leader Joins DMK Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : మక్కల్‌ నీది మయ్యం నుంచి బయటకు వచ్చిన మహేంద్రన్‌ గురువారం డీఎంకేలో చేరారు. మక్కల్‌ నీది మయ్యం ఆవిర్భావానికి ముందు నుంచి మహేంద్రన్‌ నటుడు కమల్‌ వెన్నంటి ఉంటూ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. తొలుత కోయంబత్తూరు లోక్‌సభ ఎన్నికల్లో, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సింగానల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కమల్‌కు దూరమై ఆ పార్టీని వీడారు.

పొత్తు విషయంగా కమల్‌ చేసిన తప్పును ఎత్తి చూపుతూ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో డీఎంకేలో చేరాలని నిర్ణయించుకుని గురువారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్‌ నేతలు టీఆర్‌ బాలు, కేఎన్‌ నెహ్రూ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనేక మంది నేతలు డీఎంకేలో చేరారు. ఆయనకు స్టాలిన్‌ సభ్యత్వ కార్డును అందజేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top