రాయలసీమ ద్రోహి గోబ్యాక్‌.. చంద్రబాబుకు నిరసన సెగ | Locals Protest To Against Chandrababu In Kurnool District | Sakshi
Sakshi News home page

రాయలసీమ ద్రోహి గోబ్యాక్‌.. చంద్రబాబుకు నిరసన సెగ

Nov 16 2022 8:09 PM | Updated on Nov 17 2022 8:40 AM

Locals Protest To Against Chandrababu In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా: పత్తికొండలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. హైకోర్టును అడ్డుకుంటున్న ద్రోహి అంటూ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

కాగా, కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టు​కుని వచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్‌ ఎస్టేట్‌ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ ఆయన మండిపడ్డారు.
చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్‌ చంద్రబాబే’  

Advertisement
 
Advertisement
Advertisement