
సాక్షి,ఖమ్మం: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్,పొంగులేటి,భట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?.దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సీఎం రేవంత్‌రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్,కారు రేసింగ్ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే రేవంత్ రిబ్బన్ కట్‌చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్‌లు వచ్చాయి.
2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? సీఎం రేవంత్ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు.
