జేపీ నడ్డా పర్యటన.. ‘చెప్పులు మోసే గులాం ఎవరో?’: కేటీఆర్‌ సెటైర్లు | KTR Satirical Punch On BJP JP Nadda Telangana Tour | Sakshi
Sakshi News home page

జేపీ నడ్డా పర్యటన.. ‘చెప్పులు మోసే గులాం ఎవరో?’: కేటీఆర్‌ సెటైర్లు

Aug 27 2022 12:58 PM | Updated on Aug 27 2022 1:16 PM

KTR Satirical Punch On BJP JP Nadda Telangana Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా మరోసారి బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది.  ఈ క్రమంలో వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. బీజేపీ నేతలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఈరోజు జేపీ నడ్డా చప్పల్‌ను ఏ గులాం మోస్తారు?. కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నా అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. మునుగోడులో జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరైన విషయం తెలిసిందే. అమిత్‌ షా పర్యటనలో భాగంగా బండి సంజయ్‌.. ఆయన చెప్పులు మోసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు.. బండి సంజయ్‌ తీరుపై ఫైరయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ సభ వేళ ఫ్లెక్సీల రగడ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement