కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు | Kejriwal Arrested Without Proper Investigation Says RJD MP Manoj Jha | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

May 11 2024 3:04 PM | Updated on May 11 2024 3:18 PM

Kejriwal Arrested Without Proper Investigation Says RJD MP Manoj Jha

ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్జేడీ ఎంపీ 'మనోజ్ ఝా' హర్షం వ్యక్తం చేశారు. సరైన విచారణ లేకుండానే హేమంత్ సోరెన్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం సంతోషంగా ఉంది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభిస్తే జార్ఖండ్‌లో కూడా బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మనోజ్ ఝా అన్నారు.

ఎక్సైజ్ పాలసీ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి 50 రోజుల జైలులో ఉంచారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ తరపున ప్రచారం చేయడానికి కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నిలకు పూర్తయిన తరువాత జూన్ రెండున ఆయన స్వచ్చందంగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికి ముందు.. ఏప్రిల్‌లో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత సింగ్ బయటకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement