విరాట్‌ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా

Jyotiraditya Scindia Says I Play Like Virat Kohli Virender Sehwag - Sakshi

ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు.

2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్‌నాథ్‌ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. 

2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్‌ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 

విరాట్‌ కోహ్లీ, సెహ్వాగ్‌లా ఆడగలను..
భవిష్యత్‌పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్‌లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top