అజాత శత్రువుగా అందరివాడయ్యారు..

The journey of Tirupati MP Balli Durga Prasad Rao in politics - Sakshi

అందరివాడిగా పేరు పొందిన బల్లి దుర్గాప్రసాద్‌ 

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం 

న్యాయవాదిగా మొదలై తిరుపతి ఎంపీగా ఎదిగి 

చెన్నైలో కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి   

నేడు వెంకటగిరిలో అంత్యక్రియలు  

బల్లి దుర్గాప్రసాద్‌ సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎవరినీ నొప్పించక మెప్పించి అజాత శత్రువుగా అందరివాడయ్యారు. చిరునవ్వుతో మంచి తనంతో మమతానుబంధాలను పెనవేసుకున్నారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్‌ సభ్యుడిగా నిష్క్రమించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పార్లమెంట్‌ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ప్రజాసేవకే జీవితం అంకితం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు అండగా ప్రజాక్షేత్రంలో నిలబడి.. వైరస్‌ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, తిరుపతి : తిరుపతి పార్లమెంట్‌ సభ్యుడు, సీనియర్‌ రాజకీయ నేత బల్లి దుర్గాప్రసాద్‌ బుధవారం సాయంత్రం ప్రజా క్షేత్రం నుంచి నిష్క్రమించారు. రాజకీయంగా వివాద రహితుడిగా పేరున్న దుర్గాప్రసాద్‌ నాలుగు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో మచ్చలేని నేతగా  కొనసాగారు. నాలుగు పర్యాయాలు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక నేతగా ఖ్యాతి గడించారు. స్వస్థలం వెంకటగిరి అయినప్పటికీ రాజకీయ ప్రస్థానమంతా గూడూరులోనే సాగడం గమనార్హం. ఆయన తిరుపతికి వస్తే తన సన్నిహితులను తప్పక కలిసేవారు. ఎస్వీయూ ప్రొఫెసర్‌ దామోదరరెడ్డితో పలువురు అధ్యాపకులతో స్నేహంగా ఉండేవారు.

మిత్రులను చాలా అభిమానంగా చూసేవారు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించేవారు. దుర్గాప్రసాద్‌కు ఏర్పేడు మండలం పల్లం గ్రామానికి చెందిన భక్తవత్సలనాయుడు మంచి స్నేహితుడు. ఆయన అనారోగ్యానికి గురై స్విమ్స్‌లో చేరిన విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్‌ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ‘‘వాడికి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆస్పత్రి నుంచి వెళ్లనివ్వకండి’’ అంటూ చెప్పినట్లు ఆయన స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు భార్య సరళమ్మ, కుమారులు బల్లి కళ్యాణ్, కార్తీక్, కుమార్తె హరిత ఉన్నారు. కుమారుడు కల్యాణ్‌ తండ్రికి రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. 

రాజకీయ ప్రస్థానం ఇలా.. 

 • 1985లో గూడూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా 22,224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  
 • ఆ తర్వాత 1989లో గూడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  
 • 1994లో గూడూరు నుంచే 28,350 ఓట్ల మెజార్టీతో గెలుపొంది 1996–98 మధ్య కాలంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  
 • 1999లో 9,770 ఓట్లతో గెలుపొందారు. 2004లో టీడీపీ టికెట్‌ నిరాకరించినప్పటికీ పార్టీలోనే కొనసాగారు.  
 • 2009లో పోటీచేసి 10,638 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ టికెట్‌ నిరాకరించడంతో మిన్నకుండిపోయారు.  
 • 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.  
 • ఎంపీగా తిరుపతితో పాటు గూడూరు, వెంకటగిరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నించారు.
 • న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ దివంగత మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు.  
 • దుర్గాప్రసాద్‌రావు బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి వెంకటగిరిలోనే న్యాయవాద ప్రాక్టీస్‌ ప్రారంభించారు.   
 • 1985లో గూడూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీ అడుగుపెట్టారు. అక్కడి నుంచి గూడూరు కేంద్రంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తుది శ్వాస విడిచే వరకు క్రియాశీలకంగా ఉన్నారు.
 • ఆయన స్వస్థలం వెంకటగిరిలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-11-2020
Nov 24, 2020, 03:59 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కంటైన్మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లను 50% సీటింగ్‌ సామర్థ్యంతో తెరిచేందుకు...
24-11-2020
Nov 24, 2020, 03:39 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ రూపంలో మళ్లీ విరుచుకుపడితే..? వైరస్‌ విజృంభించిన మొదట్లో ఎదురైన గడ్డు పరిస్థితులు...
24-11-2020
Nov 24, 2020, 00:34 IST
కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కనబడుతున్న నిర్లిప్త ధోరణిపై వ్యక్తమవుతున్న ఆందోళన సుప్రీంకోర్టును కూడా తాకిన వైనం...
23-11-2020
Nov 23, 2020, 20:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సాయంతో  తీసుకొస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి...
23-11-2020
Nov 23, 2020, 12:45 IST
అహ్మదాబాద్‌: అందరిని రక్షించే వారియర్‌ తన కుటుంబాన్ని మాత్రం కరోనా నుంచి  కాపాడుకోలేకపోయారు. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న కరోనా తాజాగా...
23-11-2020
Nov 23, 2020, 11:54 IST
‘‘ఈ నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాలన్నీ నివేదిక...
23-11-2020
Nov 23, 2020, 03:24 IST
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ...
22-11-2020
Nov 22, 2020, 17:32 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1 ,121...
22-11-2020
Nov 22, 2020, 10:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌  ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలి దశలో కోవిడ్‌ సృష్టించిన విలయం...
22-11-2020
Nov 22, 2020, 10:07 IST
చికిత్స పొందుత్నువారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది.
22-11-2020
Nov 22, 2020, 08:18 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలపై ప్రయోగాలు చేపట్టి చివరి...
22-11-2020
Nov 22, 2020, 08:07 IST
అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికాలో.. అంతకు ముందు నుంచే యూరోప్‌ దేశాల్లో.. దసరా, దీపావళి పండుగల తర్వాత భారత్‌లోనూ కరోనా...
22-11-2020
Nov 22, 2020, 04:48 IST
న్యూఢిల్లీ/రియాద్‌: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్‌ అని ప్రధాని మోదీ జీ20...
22-11-2020
Nov 22, 2020, 04:45 IST
ఆమె లాక్‌డౌన్‌ సమయంలో మహిళా పోలీసుల టాయ్‌లెట్‌ అవసరాలకు 20 వానిటీ వాన్‌లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ బాధిత...
21-11-2020
Nov 21, 2020, 16:14 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. యూరప్‌ దేశాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో ఫ్రాన్స్‌ వంటి దేశాలు...
21-11-2020
Nov 21, 2020, 14:13 IST
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి గురించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇదేలా సాధ్యమయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో...
21-11-2020
Nov 21, 2020, 11:14 IST
దుబాయ్‌: ఒక దొంగతనం కేసులో దుబాయి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.  ఫేస్‌ మాస్కులను ఎత్తుకుపోయిన గ్యాంగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల...
21-11-2020
Nov 21, 2020, 10:54 IST
కొవిడ్‌ కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం(ఇంటి నుంచే పని)...
21-11-2020
Nov 21, 2020, 10:21 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి....
21-11-2020
Nov 21, 2020, 09:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్‌ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top