స్టాలిన్‌ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్‌’ విషెస్‌ | Isro Ad Row: BJP Says Happy birthday Wishes To MK Stalin In His Favourite Chinese Language, Photo Viral - Sakshi
Sakshi News home page

ISRO Ad China Flag Controversy: స్టాలిన్‌ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్‌’ విషెస్‌

Published Fri, Mar 1 2024 3:10 PM | Last Updated on Fri, Mar 1 2024 3:52 PM

Isro Ad Row: BJP Says Happy birthday To Stalins favourite language - Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. 

ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్‌ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే  ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌ వివరణ కూడా ఇచ్చారు.  ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. 

వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్‌ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో బీజేపీ కౌంటర్‌ వేసింది. 

అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్‌ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్‌ ఇచ్చింది. 

తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో..  మోదీ చైనా  జెండాను పేపర్‌ యాడ్‌లో  నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్‌ విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement