
పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది.
శనివారం వెల్దుర్తి మండలం బోదిల వీడు సమీపంలో జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేళ్వరరావులు హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్ల పాడులో కొన్నాళ్లుగా టీడీపీలో మొద్దయ్య, వెంకటరామయ్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరావును స్కార్పియో కారుతో ఢీకొట్టి హత్య చేశారు.
ఈ హత్య చేసింది వెంకటరామయ్య వర్గీయులేనని తెలుస్తోంది. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ చెందిన వారేననే పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరావును వెంకటరామయ్య వర్గం చంపిందని మృతుల బంధువులు చెబుతున్నారు.
జవిశెట్టి సోదరుల్ని హతమార్చేందుకు ఉపయోగించిన స్కార్పియోపై జేబీఆర్ (జూలకంటి బ్రహ్మారెడ్డి)స్కిక్కర్ ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోత్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.