హుజురాబాద్‌ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే

Huzurabad Bypoll: TRS Leaders Watching Results On TV At Mee Seva Center - Sakshi

టీఆర్‌ఎస్‌లో నిస్తేజం

సాక్షి, కరీంనగర్‌: ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్‌ఎస్‌లో నిస్తేజం నెలకొంది. ఊహించని విధంగా మంగళవారం కౌంటింగ్‌ ప్రారంభం నుంచే ఈటలకు మెజార్టీ పెరగడంతో కార్యకర్తల్లో నైరా శ్యం నెలకొంది. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్‌ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి.. హుజూరాబాద్‌లోనే మూడు నెలలు మకాం వేసి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో లీడర్లతో పాటు క్యాడర్‌లో స్తబ్ధత నెలకొంది. 

మీసేవ కార్యాలయంలో మంత్రి..
మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌బాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్, తదితరులు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాన్ని టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గడిపారు. రౌండ్ల వారీగా వస్తున్న ఫలితాలపై ద్వితీయ శ్రేణి నాయకత్వంతో చర్చిస్తూ గడిపారు. 
చదవండి: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్‌ ఘన విజయం

టీవీలకు అతుక్కుపోయిన జనం
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల సరళిని తెలుసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, హోటళ్లలో ప్రజలు హుజూరాబాద్‌ ఫలితంపై ఆరా తీస్తూ చర్చల్లో మునిగిపోయారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top