నరేంద్రమోదీ పేరు ఎత్తాలంటేనే చంద్రబాబుకు భయం | Gudivada Amarnath Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజకీయ అవసరాల కోసమే స్టీల్‌ ప్లాంట్‌పై కపట ప్రేమ

Feb 16 2021 7:12 PM | Updated on Feb 16 2021 7:17 PM

Gudivada Amarnath Fires On Chandrababu Naidu  - Sakshi

సాక్షి, విశాఖ : రాజకీయ అవసరాల కోసం టీడీపీ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని వాడుకుంటుందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖలో అడుగుపెట్టి మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2014లో స్టీల్‌ ప్లాంట్‌పై కుట్ర జరిగితే సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. 'చంద్రబాబు ఓ మాటల పకీరు..తండ్రీ కొడుకులు విశాఖ  అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. స్టేట్ హోమ్ కడతామంటే కోర్టుకు వెళ్లారు. విశాఖను  ఎగ్జక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి ఎన్నిరోజులైనా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తన వైఖరి వెల్లడించలేదు. 

నీ లాంటి పిరికి పందల మాటలు నమ్మే స్థితిలోప్రజలు లేరు' అని పేర్కొన్నారు. చంద్రబాబుకు నరేంద్రమోదీ పేరు ఎత్తాలంటేనే భయమని, ఆయనంత పిరికి వాళ్లు ఎవరూ ఉండరని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ భయంతో రాత్రికి రాత్రే ఉమ్మడి రాజధాని నుంచి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. విశాఖ ప్రజలనే పిరికి వాళ్లని అన్న చంద్రబాబును గతంలో ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ వాసులే తరిమి వేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. 

చదవండి : (నా రూటే సెపరేటూ.. చంద్రన్న వింత వాదన)
(ప్రధానికి లేఖ రాసే ధైర్యం చంద్రబాబుకు లేదా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement