బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో కలకలం

సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించిన ఓ ఆడియో రాష్ట్ర బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశాడని, ఆయన వల్ల తన నియోజకవర్గ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానంటూ రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఆడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(చదవండి : హైదరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే..)
'నా నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి లేఖ రాస్తా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మిగిలిన డివిజన్లలో నేను జోక్యం చేసుకోను. నా నియోజకవర్గంలో మాత్రం నాకు ప్రియార్టీ ఇయ్యమని కోరినా నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నన్ను గెలిపించిన కార్యకర్తలకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయాను. ప్రస్తుతం నా ఫ్యామిలీలో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఆ చావులో ఉన్నా. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి