
సాక్షి, హైదరాబాద్: బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద సాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఎలాంటి లేఖ రాలేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. ‘‘టీఆర్ఎస్ నాపై అసత్య ప్రచారాలు చేస్తోంది. (చదవండి: హైదరాబాద్‌లో హైటెన్షన్.. సంజయ్ సవాల్)
భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు వెళ్లకూడదు. ఫలానా ఆలయానికి రమ్మంటే నేనే వచ్చేవాడిని. టీఆర్ఎస్ చెప్పినట్టే ఈసీ నడుచుకుంటోందని’’ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. (చదవండి: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సర్వే!)