వచ్చేవి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే.. 

Gadapa Gadapaku Congress program started in Kodada - Sakshi

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే  

కోదాడలో ‘గడప గడపకు కాంగ్రెస్‌’ కార్యక్రమం ప్రారంభం

కోదాడ: అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాబోతున్నాయని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. ప్రజలను అక్కున చేర్చుకొని ముందుకుపోవడానికి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ‘గడప గడపకు కాంగ్రెస్‌’కార్యక్రమంలో, నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లని  కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకు రాహూల్‌గాంధీ సందేశం తీసుకెళ్లాలని, దీనిలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలని స్పష్టం చేశారు. 

గడప గడపకు పార్టీని తీసుకెళ్లాలి 
బీజేపీ నుంచి దేశాన్ని కాపాడటానికి రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని మండిపడ్డారు.

దేశాన్ని అదానీకి దోచిపెట్టారని, అదానీ చేసిన ఆర్థిక కుంభకోణంలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. ఆయన వెంట ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, బోస్‌రాజు, నిరంజన్, పటేల్‌ రమేష్రెడ్డి తదితరులున్నారు. 

దామోదర్‌రెడ్డి వర్సెస్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి 
కాంగ్రెస్‌ సమీక్ష సమావేశంలో సాక్షాత్తు మాణిక్‌రావు ఠాక్రే ఎదుటే సూర్యాపేట నియోజకవర్గ నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేష్రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యాపేట కాంగ్రెస్‌ కంచుకోట అని, నేడు దానికి బీటలు వారడానికి కారణం ఎవరో చెప్పాలని, తమను కనీసం సమావేశానికి ఆహ్వానించలేదని రమేష్రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో దామోదర్‌రెడ్డి కల్పించుకొని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి అంత ప్రా«ధాన్యమివ్వాల్సిన అవసరం లేదనడంతో గొడవ మొదలైంది. దీంతో ఠాక్రే, ఉత్తమ్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top