వంగలపూడి అనిత మాటలు హాస్యాస్పదం: తానేటి వనిత ఫైర్‌ | Ex Minister Taneti Vanitha Satirical Comments On Vangalapudi Anitha | Sakshi
Sakshi News home page

వంగలపూడి అనిత మాటలు హాస్యాస్పదం: తానేటి వనిత ఫైర్‌

Jul 21 2024 7:49 PM | Updated on Jul 21 2024 8:20 PM

Ex Minister Taneti Vanitha Satirical Comments On Vangalapudi Anitha

సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను స్వేచ్చగా పనిచేసుకోవానివ్వాలని కామెంట్స్‌ చేశారు.

కాగా, తానేటి వనిత ఆదివారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ నాయకుడు వైఎస​్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హోంమంత్రి అనిత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆమె మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి అయ్యారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యేనే.

హోంమంత్రి అనిత మాట్లాడే మాటలకు మహిళలు తలదించుకుంటున్నారు. పోలీసులను స్వేచ్చను ఇచ్చి.. వారిని సక్రమంగా పనిచేసుకోనివ్వాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే మా పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement