‘ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ కాదు.. లోకేశ్‌ ఆర్డర్‌ నడుస్తోంది’ | Ex Minister Anil Kumar Yadav Serious Comments On TDP | Sakshi
Sakshi News home page

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ కాదు.. లోకేశ్‌ ఆర్డర్‌ నడుస్తోంది: అనిల్‌ కుమార్‌ యాదవ్‌

Jul 18 2024 2:26 PM | Updated on Jul 18 2024 3:25 PM

Ex Minister Anil Kumar Yadav Serious Comments On TDP

సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతో​ందన్నారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. అలాగే, లా అండ్‌ ఆర్డర్‌ కాదు నారా లోకేశ్‌ ఆర్డర్‌ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో..‘రషీద్‌ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

 

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చకండి. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంది. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ కనిపించడం లేదు. లోకేష్‌ ఆర్డర్‌ మాత్రమే కనిపిస్తోంది. నిన్నటి వినుకొండ వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి అన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆ ఒకటిన్నర నెలలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement