ఓపక్క తీవ్ర అభ్యంతరాలు.. TTD పాలకమండలిలో మరొకరికి చోటు | Even Objections Chandrababu Govt Appoints Another Member To TTD | Sakshi
Sakshi News home page

ఓపక్క తీవ్ర అభ్యంతరాలు.. TTD పాలకమండలిలో మరొకరికి చోటు

Nov 1 2024 8:25 PM | Updated on Nov 1 2024 9:17 PM

Even Objections Chandrababu Govt Appoints Another Member To TTD

అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈలోపే పాలకమండలి బోర్డులో మరొకరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. బీజేపీ నుంచి భాను ప్రకాష్ రెడ్డి 25వ సభ్యుడిగా  నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ కొత్త బోర్డుపై మునుపెన్నడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు, ఆరోపణలు, వివాదాల్లో నిలిచినవాళ్లకే బోర్డులో చోటు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కోసం సభ్యులను 24 నుంచి 25కి పెంచారు.  ఈ మేరకు బీఆర్‌ నాయుడు చైర్మన్‌గా.. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.



అసలే టీటీడీ బోర్డులో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలకు ప్రాతినిధ్యం  ఇవ్వలేదన్న బలమైన విమర్శ వినిపిస్తోంది. ఇది చాలదన్నట్లు నేర చరితులను టీటీడీ సభ్యులుగా నియమించింది బాబు సర్కారు. అత్యధికంగా కేసులు ఉన్న టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్, ఎం ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూలకు  సభ్యులుగా నియమించడంపైనా దుమారం చెలరేగింది. మల్లెల రాజశేఖర్‌పై రౌడీషీట్‌తో పాటు కల్తీ మద్యం కేసు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఇక.. ఎంఎస్‌ రాజుపై ఏకంగా 23 క్రిమినల్‌ కేసులు ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీవాణి ట్రస్ట్‌ రద్దు చేస్తా: బీఆర్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement