కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల

Etela Rajender Aggressive Comments On KCR Harish Rao At Gajwel - Sakshi

సాక్షి, సిద్ధిపేట: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ అనుమతి లేకుండ చీమ కూడా చిటుక్కుమనదని ధ్వజమెత్తారు. గతంలో తాను ఆర్ధిక మంత్రిగా ఉన్నా సొంత ఇర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపారు. కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు ఉందా అని ప్రశ్నించారు.

ఈ మేరకు గజ్వేల్‌ నియోజకవర్గం కుకునూర్‌పల్లి మండలం లకుడారంలో ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మంత్రులంతా అతని బానిసలని, స్వతంత్రంగా పనిచేయలేరని మండిపడ్డారు. కేసీఆర్‌ను కాదని ఏ మంత్రి  కూడా  నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు.

కాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌ గడ్డ మీద సీఎం కేసీఆర్‌పై పోటీకి నిలబడ్డారు. ఇక్కడ మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్‌ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. మరోవైపు కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
చదవండి: ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top