ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్

Election Commission Of India Announce Notification For MLC Election In AP - Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం షెడ్యూల్‌ విడుదల విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఆగష్టు 6న విడుదలకానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగష్టు 13 కాగా, 24న పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల వారిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top