ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

EC Served Notices To pragathi bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. 

ప్రగతి భవన్‌ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్‌ఎస్‌ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. 

గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్‌ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. 

క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top