Divya Vani Serious Comments On TDP Party and Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

Divyavani: ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు: కన్నీరు పెట్టుకున్న దివ్యవాణి

Jun 2 2022 11:30 AM | Updated on Jun 2 2022 12:04 PM

Divyavani Serious Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ మాజీ నాయకురాలు దివ్యవాణి.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు. దివ్యవాణి విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. 

ఈ సందర్బంగా దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కొందరు మహిళా నేతలు నాకు ఫోన్‌ చేసి తిట్టారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను.  పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా సమస్యను లోకేశ్‌ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారు.

కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు.  చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్‌ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. 

ఇది కూడా చదవండి: ‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement