ఈడీ లేకుంటే బీజేపీనే లేదు

CPM Leader Sitaram Yechury Said That Without ED There Is No BJP - Sakshi

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ఈడీతో భయపెడుతూ ప్రభుత్వాలను కూలదోస్తోంది

బీజేపీని గద్దె దించితేనే హక్కుల పరిరక్షణ సాధ్యం

మోదీని దింపేందుకు టీఆర్‌ఎస్‌తో కలసి పనిచేస్తాం

సాక్షి, హైదరాబాద్‌:  ఈడీ లేకుంటే బీజేపీనే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆ పార్టీ కూలదోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పారు. ఈడీ ఇంకా తమ దాకా రాలేదని, వచి్చనా ఆశ్చర్యపోయేదేం లేదని చెప్పారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ జరగాలనీ, బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం
1948 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 1949 జూలై 11వ తేదీ వరకు రా్రïÙ్టయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై అప్పటి కేంద్ర హెూంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిషేధం విధించారని ఏచూరి తెలిపారు. ఆయన్ను ఇప్పుడు తమ సొంత మనిషి అన్నట్టు బీజేపీ ప్రచారం చేసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం ఘర్షణగా వక్రీకరించి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు లొంగిపోవడానికి అంగీకరిస్తేనే భారత సైన్యం ఇక్కడకు వచి్చందని చెప్పారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, రజాకార్లు 57 మంది మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. 

లౌకిక శక్తుల ఏకీకరణకు కృషి
బీజేపీని గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా లౌకిక శక్తుల ఏకీకరణకు తాము కృషి చేస్తున్నామని ఏచూరి చెప్పారు. ఈ నెల 25న హర్యానాలో దేవీలాల్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వామపక్ష పారీ్టలను ఆహ్వానించారని, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కూడా ఆహా్వనిస్తున్నారని తెలిపారు. 

తెలంగాణలో అధికారానికి బీజేపీ యత్నాలు..
కర్ణాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని ఏచూరి చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ అధికారం సాధించే క్రమంలో చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సీపీఎం వ్యూహం ఉంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతోందని, తాము కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కలసి నడవడంలో తప్పులేదన్నారు. మోదీని గద్దె దింపేందుకు కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు టీఆర్‌ఎస్‌ ఇష్టమని వ్యాఖ్యానించారు. 

బీజేపీయే ప్రథమ శత్రువు: తమ్మినేని
మునుగోడులో టీఆర్‌ఎస్‌కు తాము మద్దతు ఇచి్చనంత మాత్రాన ప్రజా సమస్యల పరిష్కారంలో ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమలు తమకేమీ లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమకు ప్రథమ శత్రువు అని, దాన్ని ఓడించడమే తమ ముందున్న తక్షణ రాజకీయ అవసరం అని చెప్పారు. సీపీఎం రాష్ట్ర నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కుట్ర.. క్విడ్‌ ప్రోకో!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top